అరుణ్ అదిత్, మేఘా ఆకాష్, అర్జున్ సోమయాజుల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్‌రెడ్డి దర్శకుడు. అర్జున్ దాస్యన్ నిర్మాత. సెన్సార్ పూర్తయింది. సెప్టెంబర్ 3న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ ఇది. మేఘ అనే అమ్మాయి జీవితంలోకి ప్రవేశించిన ఇద్దరబ్బాయిలు ఎవరు? వారిలో ఆమె ఎవరిని ప్రేమించిందన్నది ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. దాదాపు మూడు వందల థియేటర్స్‌లో ఈ సినిమాను విడుదలచేస్తున్నాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూ.