Dear Megha | మూసధోరణికి పరిమితంకాను

‘వ్యాపార దృక్పథంతో కాకుండా సగటు ప్రేక్షకుడి కోణం నుంచే కథలు వింటుంటాను. నిర్మాతగా మూసధోరణికి పరిమితం కాకుండా అన్ని జోనర్లలో సినిమాలు చేయాలనుంది’ అని అన్నారు అర్జున్ దాస్యన్. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘డియర్మేఘ’. అరుణ్ అదిత్, మేఘా ఆకాష్, అర్జున్ కీలక పాత్రల్ని పోషించారు. సుశాంత్‌రెడ్డి దర్శకుడు. ఈ నెల 3న విడుదలకానుంది. బుధవారం హైదరాబాద్‌లో నిర్మాత అర్జున్దాస్యన్ మాట్లాడుతూ ‘అమ్మాయి దృక్కోణం నుంచి సాగే ఎమోషనల్ లవ్‌స్టోరీ ఇది. మేఘ జీవితాన్ని మలుపుతిప్పిన ఇద్దరబ్బాయిలు ఎవరన్నది అలరిస్తుంది. గ్లామర్ పంథాకు భిన్నంగా మేఘాఆకాష్ చేసిన తొలి సినిమా ఇది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో ఆమె కనిపిస్తుంది. నిర్మల్ నా స్వస్థలం. చిన్నతనం నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితోనే నిర్మాతగా మారాను. వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో తొలుత ఓ సినిమాను ప్రారంభించా. గ్రాఫిక్స్ పనుల వల్ల ఆ సినిమా విడుదల ఆలస్యమవుతోంది. చిత్రనిర్మాణంలో రాణించడానికి అవసరమైన మెళకువలను వీఎన్ఆదిత్యతో పాటు సత్యానంద్ వద్ద నేర్చుకున్నా. ఇండస్ట్రీలే వారినే నా గురువులుగా భావిస్తాను’అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

