Robinhood | ‘రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్నర్.?
Robinhood | హిట్టు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నటుడు నితిన్ (Nithiin). ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood).
Robinhood | హిట్టు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నటుడు నితిన్ (Nithiin). ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood). ఈ సినిమాకు వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్నాడు. భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్.
అయితే సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (Australian Cricketer David Warner) నటించబోతున్నాడని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. డేవిడ్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే రాబిన్ హుడ్ ప్రమోషన్స్‌లో డేవిడ్ వార్నర్ కూడా పాల్గోంటాడని దర్శకుడు వేణు తాజాగా తెలిపాడు. ఇక డేవిడ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో పాల్గోంటాడ లేదా నేరుగా ప్రీ రిలీజ్ వేడుకకు వస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

