తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని నటిస్తున్న ‘హాయ్ నాన్న’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ‘దసరా’ వంటి పూర్తి స్థాయి మాస్ సినిమా తర్వాత హీరో నాని ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకురావడం ఆసక్తిని పెంచుతున్నది. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బేబీ కియారా ఖన్నా కీలక పాత్రను పోషిస్తున్నది.
శౌర్యువ్ దర్శకుడు. డిసెంబర్ 7న విడుదలకు సిద్ధమవుతున్నది. ట్రైలర్‌ను ఈ నెల 24న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. తండ్రీకూతుళ్ల అనుబంధానికి దర్పణంలా హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సానుజాన్ వర్గీస్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, నిర్మాణ సంస్థ: వైరా ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు: మోహన్ చెరుకూరి, డా॥ విజయేందర్ రెడ్డి తీగల.