మే 5న డీఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్
శతాధిక చిత్రాల దర్శకుడు దివంగత దాసరి నారాయణ రావు 77వ జయంతిని పురస్కరించుకొని మే 5వ తేదీన ‘డీఎన్ఆర్ ఫిల్మ్స్ అవార్డ్స్'ను ప్రదానం చేయబోతున్నారు.
శతాధిక చిత్రాల దర్శకుడు దివంగత దాసరి నారాయణ రావు 77వ జయంతిని పురస్కరించుకొని మే 5వ తేదీన ‘డీఎన్ఆర్ ఫిల్మ్స్ అవార్డ్స్’ను ప్రదానం చేయబోతున్నారు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఆయన శిష్యులు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహా రావు, సి.కల్యాణ్ అధ్యక్ష కార్యదర్శులుగా బి.ఎస్.ఎన్.సూర్య నారాయణ, సినీ పాత్రికేయులు ప్రభు, ధీరజ అప్పాజీ సభ్యులుగా అవార్డ్స్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘మే 5న నిర్వహించే వేడుకలో అభినవ దర్శక రత్న, అభినయ రత్న, నిర్మాణ రత్న, పంపిణీ రత్న, ప్రదర్శనా రత్న, కథా రత్న, సంభాషణా రత్న, గీత రత్న, పాత్రికేయ రత్న, సేవా రత్న పురస్కారాలను ప్రదానం చేస్తాం’ అన్నారు. ఇకపై ప్రతి ఏటా ఈ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

