కన్నడ హీరో డార్లింగ్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘లవ్ మోైక్టెల్-2’. ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో అనువదించి విడుదల చేస్తున్నారు నిర్మాత ఎం.వి.ఆర్.కృష్ణ . త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ‘నీదేలే నీదేలే జన్మ’ అంటూ సాగే ఈ సినిమాలోని గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు.
గురుచరణ్ రాసిన ఈ గీతానికి నకుల్ అభయాన్కర్ స్వరపరచగా సురేంద్రనాథ్ ఆలపించారు. ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే ఓ పాటను, ట్రైలర్‌నీ, టీజర్‌ని విడుదల చేశామని, వాటికి మంచి స్పందన వస్తున్నదని, వేసవి సెలవుల్లో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. మిలీన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్డేవిడ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.