Danny Movie | రా అండ్ రస్టిక్ యాక్షన్ లవ్ స్టోరీతో రానున్న ‘డానీ’.. నవంబర్ 13న గ్రాండ్ రిలీజ్!
Danny Movie | టాలీవుడ్లో వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ హీరో ఆశిష్ గాంధీ, టాలెంటెడ్ డైరెక్టర్ కళ్యాణ్‌జీ గోగణ కాంబినేషన్లో వస్తోన్న మోస్ట్ అంటెసిపేటెడ్ మూవీ ‘డానీ’.
Danny Movie | టాలీవుడ్లో వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ హీరో ఆశిష్ గాంధీ, టాలెంటెడ్ డైరెక్టర్ కళ్యాణ్‌జీ గోగణ కాంబినేషన్లో వస్తోన్న మోస్ట్ అంటెసిపేటెడ్ మూవీ ‘డానీ’. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘నాటకం’ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు అదే జోరుతో అంతకుమించిన ఇంటెన్సివ్ కంటెంట్‌తో ఈ కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ పతాకాలపై ప్రముఖ నిర్మాత రిజ్వాన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్, క్రైమ్, రా అండ్ రస్టిక్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రంపై ట్రేడ్ సర్కిల్స్‌లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ స్ట్రైక్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. సినిమాలోని బోల్డ్ కంటెంట్, రా అండ్ రస్టిక్ మేకింగ్ స్టైల్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సాధారణ ప్రేమ కథలకు భిన్నంగా, మనిషి జీవితంలో ఉండే అలవాట్లకు, అతను మనసారా కోరుకునే ప్రేమకు మధ్య జరిగే భావోద్వేగ సంఘర్షణే ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ కానుంది. ఓ వ్యక్తి తన జీవితంలో అలవాటు చేసుకున్న పద్ధతులు అతని గమ్యభావితాన్ని ఎలా మార్చాయి? ఆ వ్యక్తి నిజమైన ప్రేమలో పడిన తర్వాత తన జీవితంలో ఎలాంటి పెనుమార్పులు వచ్చాయి? ఈ రెండు విభిన్నమైన ధోరణుల మధ్య నలిగిపోయే పాత్రల ప్రయాణం ఎలా సాగిందనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమాను అత్యంత సహజంగా తెరకెక్కించారు.
ఈ చిత్రంలో ఆశిష్ గాంధీ సరసన సేజల్ గుప్తా హీరోయిన్గా నటిస్తుండగా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మేకర్స్ తాజాగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేసింది. హీరో హీరోయిన్ల డిఫరెంట్ లుక్స్, పోస్టర్ డిజైన్ తీరు సినిమా నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఏకే ఆనంద్ సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు అద్భుతంగా నిర్వర్తించారు.
కొల్లి గోపాల కృష్ణ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి ఖుషి, సుధాకర్ గోడ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భార్గవ్ తోట ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, రామ్ సుంకర మరియు కళ్యాణ్‌జీ గోగణ యాక్షన్ కొరియోగ్రఫీ అందించగా, సాయిరామ్ జల్లా కో-డైరెక్టర్‌గా సేవలందించారు. రిథమ్ స్టూడియోస్ సౌండ్ డిజైన్ చేయగా, కోటి వర్క్స్ పబ్లిసిటీ డిజైన్స్ అందించారు. సాయి సతీష్ పీఆర్వోగా వ్యవహరిస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ రా అండ్ రస్టిక్ రొమాంటిక్ క్రైమ్ డ్రామా ‘డానీ’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 13న ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

