లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ హీరో డానియల్ క్రేగ్ నటించిన ఓ కొత్త వోడ్కా యాడ్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఆస్కార్ విన్నర్ గ్రహీత తైకా వైటిటి ఆ యాడ్‌ను రూపొందించారు. బెల్వడీర్ వోడ్కా కంపెనీ కోసం ఆ ప్రకటన చేశారు. ఓ బ్రిడ్జ్‌పై వైట్ షూట్లో ఉన్న క్రేగ్.. ఆ తర్వాత లెదర్ జాకెట్‌తో డిస్కో స్టెప్పులు వేస్తూ వెళ్తాడు. రెండు నిమిషాల కన్నా ఎక్కువ నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఆ యాడ్ చూడాల్సిందే.