CVL Narasimha Rao | ‘మా’ అసోసియేషన్ కు సీవీఎల్ నరసింహారావు షాక్
సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు (CVL Narasimha Rao) ‘మా’ అసోసియేషన్ కు షాకిచ్చారు. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు సీవీఎల్ నరసింహారావు ప్రకటించారు.

సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు (CVL Narasimha Rao) ఇప్పటికే ‘మా’ అధ్యక్ష ఎన్నికల (Maa Elections) పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన ‘మా’ అసోసియేషన్ కు షాకిచ్చారు. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు సీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. పరీక్ష రాయకుండానే తాను ఫెయిల్ అయ్యానని ఈ సందర్భంగా సీవీఎల్ నరసింహరావు అన్నారు. మరోవైపు బీజేపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు.
బురదలో ఉన్నా వికసించేందుకు తాను కమలాన్ని కాదని ఈ సందర్భంగా సీవీఎల్ అన్నారు. ప్రకాశ్ రాజ్, బండి సంజయ్ కు ఆయన క్షమాపణలు చెప్పారు. తొలుత మా అధ్యక్ష పదవికి నామినేషన్ వేసి ఉపసంహరించుకున్నారు సీవీఎల్. మరో రెండు రోజుల్లో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు (Maa Elections) జరుగనున్న నేపథ్యంలో సీవీఎల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరుగనున్నాయి. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ఈ సారి ప్రధానంగా ప్రకాశ్ రాజ్ (Prakash Raj) , మంచు విష్ణు (Manchu Vishnu) మధ్యే పోటీ నెలకొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Seetimaarr | ఓటీటీలో ‘సీటీమార్’ ఈల వేసేది అప్పుడే..!
Konda Polam movie Review | కొండపొలం రివ్యూ
Chiranjeevi: కుటుంబంతో కలిసి ‘కొండ పొలం’ వీక్షించిన చిరంజీవి.. కామెంట్ ఏంటి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

