సినిమాకు కాంబినేషన్‌తో పాటు కథ కూడా ఎంతో ముఖ్యమైనది. అందుకే కథ నచ్చితేనే సినిమాను నిర్మిస్తాను. అంతేకాదు కథ బాగుంటే బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా సినిమాలు నిర్మిస్తాను’ అన్నారు నిర్మాత శ్రీనివాస చిట్టూరి. సమంత నటించిన ‘యూటర్న్’ చిత్రంతో నిర్మాతగా మారిన శ్రీనివాస చిట్టూరి తాజాగా నిర్మించిన సినిమా ‘కస్టడీ’. నాగ చైతన్య కథనాయకుడిగా నటించిన ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు. ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస చిట్టూరి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
మన తెలుగు దర్శకులు బిజీగా వుండటం, వాళ్లు ఆల్రెడీ నాలుగైదు సినిమాలకు కమిటై వుండటంతో నాకు ఎంతో ఇష్టమైన తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమా చేయాలని అనుకున్నాను. తన స్క్రీన్‌ప్లే, ఆలోచనా విధానం నాకు చాలా ఇష్టం. ఎంత పెద్ద సీరియస్ ఇష్యూని కూడా మంచి స్క్రీన్‌ప్లేలో ఎంటర్టైనింగ్గా చెప్పగలరు. ‘కస్టడీ’ కథ విషయంలో కూడా వెంకట్ ప్రభు మిక్స్ చేసిన ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ నాకు బాగా నచ్చాయి. ఈ కథ సీరియస్‌గా కొనసాగుతున్నా వినోదాన్ని జోడించిన విధానం నన్ను బాగా ఆకర్షించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలుగు ఎమోషన్స్‌తో ఒక హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.
నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధిస్తుంది
ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర ఎంతో ఉన్నతంగా వుంటుంది. నిజాయితీగా పనిచేసే కానిస్టేబుల్ పాత్రలో ఆయన కనిపిస్తాడు. రూరల్ పోలీస్‌స్టేషన్‌లోని ఒక కానిస్టేబుల్ కథ ఇది. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ చేశాం. నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిబోయే చిత్రంగా కస్టడీ వుండబోతుంది. నాగార్జున కెరీర్లో ‘శివ’ ఎలా గుర్తుండిపోయిందో నాగచైతన్య కెరీర్లో కస్టడీ అలా గుర్తుండిపోతుంది. శివ సినిమానే కాదు అందులో పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో, కస్టడీలోని పాత్రలు గుర్తుండిపోతాయి. ప్రతి పాత్ర యూనిక్‌గా వుంటుంది.ఈ సినిమా కోసం చిత్రీకరించిన అండర్‌వాటర్ సీక్వెన్స్ ఇప్పటి వరకు ఏ సినిమాలో చూసి వుండరు. హాలీవుడ్ తరహాలో మన ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుంది. దాదాపు ఇరవైరోజులు ఈ సీక్వెన్స్ చేశాం. నాలుగు యాక్షన్ ఏపిసోడ్లు కూడా అద్భుతంగా వుంటాయి.
రామ్ పుట్టినరోజున టీజర్
నాకు ఫిల్మ్ ప్రొడక్షన్లో అనుభవం వుంది. ఆ అనుభవంతో ఎక్కడ అవసరమో అది చేసుకుంటూ వెళ్తున్నాను. ప్రస్తుతం రామ్-బోయపాటి కాంబినేషన్లో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. హీరో రామ్ పుట్టినరోజున టీజర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. జూన్ నుంచి నాగార్జునతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం. దీంతో పాటు ‘కస్టడీ’ సినిమాకు సీక్వెల్‌ను కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాను.