NET Trailer | నెట్ ట్రైలర్..అవికాగోర్ న్యూ రొమాంటిక్ లుక్ అదిరింది
టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ అవికాగోర్ (Avika Gor) ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) కాంబోలో వస్తున్న చిత్రం నెట్ (NET). క్రైం థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.

టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ అవికాగోర్ (Avika Gor) ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) కాంబోలో వస్తున్న చిత్రం నెట్ (NET). క్రైం థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ప్రియా (అవికాగోర్) అనే యువతి వ్యక్తిగత కదలికలను క్రిమినల్ లక్ష్మణ్ (రాహుల్ రామకృష్ణ) ఓ సబ్ స్క్రిప్షన్ ఆధారిత ప్లాట్‌ఫాంలో గమనిస్తుంటాడు. ఆ తర్వాత ఇద్దరి జీవితాల్లో ఎలాంటి ఊహించని పరిణామాలు జరిగాయనే దానిపై సస్పెన్స్ ను క్రియేట్ చేస్తూ క్యూరియాసిటీని పెంచుతుంది ట్రైలర్.
నెట్ ట్రైలర్ మహిళల గోప్యత, భద్రత లాంటి అంశాలపై చర్చను లేవనెత్తేలా సాగుతుంది. నరేశ్ కుమరన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా ఉంది. అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రపీ, ఎడిటర్ రవితేజ గిరిజాల పర్ ఫెక్ట్ కట్స్ తో అందించిన ట్రైలర్ సినిమాలపై అంచనాలను పెంచేస్తుంది. అవికాగోర్ చాలా కాలం తర్వాత స్లిమ్ గా సరికొత్త లుక్‌లో కనిపిస్తుంది.
భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తమాడా మీడియా బ్యానర్ పై రాహుల్ తమాడా, సాయి దీప్ రెడ్డి బొర్రా నిర్మిస్తున్నారు. జీ 5 ఓటీటీ ప్లాట్ ఫాంలో సెప్టెంబర్ 10న విడుదల కాబోతుంది.
ఇవికూడా చదవండి..
Chiranjeevi | బాబీ చిత్రంలో చిరంజీవి రోల్ తెలిసిపోయింది..!
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

