తమ్ముడు వచ్చేస్తున్నాడు
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తమ్ముడు’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది. ఆదివారం దర్శకుడు శ్రీరామ్ వేణు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓ స్పెషల్ వీడియోను కూడా విడుదల చేశారు.
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తమ్ముడు’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది. ఆదివారం దర్శకుడు శ్రీరామ్ వేణు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓ స్పెషల్ వీడియోను కూడా విడుదల చేశారు. ఇక ఈ వీడియో విషయానికొస్తే.. సినిమాలోని ప్రధాన తారలైన స్వసిక విజయన్, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, సీనియర్ నటి లయ, బేబీ శ్రీరామ్ ఆదిత్య ఒక్కొక్కరుగా దర్శకుడు శ్రీరామ్ వేణు దగ్గరకు వస్తారు. వీరంతా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకే తన దగ్గరకు వస్తున్నారని శ్రీరామ్ వేణు అనుకుంటారు.
కానీ వాళ్లు ‘తమ్ముడు’ రిలీజ్ ఎప్పుడు? ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అంటూ శ్రీరామ్ వేణుపై ప్రశ్నలను సంధిస్తారు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న లయ.. తన పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదని, తనకు రిలీజ్ డేట్ కూడా చెప్పలేదని వాపోతుంది. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలీక త్వరలో ఇన్ఫామ్ చేస్తానని పంపించేస్తారు శ్రీరామ్‌వేణు. చివరిలో నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ రావడం, శ్రీరామ్‌వేణు బర్త్‌డే కేక్ కట్ చేయడం.. జూలై 4న ‘తమ్ముడు’ రిలీజ్ అని అనౌన్స్ చేయడంతో వీడియో ముగిసింది. ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్, సంగీతం: అజనీష్ లోకనాథ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలోని 8 మున్సిపాలిటీల్లో నిలిచిన ఎన్నికల ప్రక్రియ..!
Saurav Das | సౌరవ్ దాస్, రాంకాలకు అదనపు జుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్ట్
DGP CV Anand | అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు.. నిజాయితీగా సేవ చేయడమే వారికి నిజమైన నివాళి: డీజీపీ సీవీ ఆనంద్
‘తమపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలి’
IND vs PAK | దేశంలో అస్థిరతకు భారత భద్రతా సలహాదారే కారణం.. మళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

