తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టు అన్నాత్తే (Annaatthe). శివ (Siva) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో స్టార్ హీరోయిన్లు నయనతార (Nayanthara), కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. కీర్తిసురేశ్ ఈ చిత్రంలో రజినీకాంత్ సోదరిగా కనిపించనున్నట్టు టాక్. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అన్నాత్తే ఫస్ట్ లుక్ పోస్టర్ ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదల చేయనున్నారు.
ఈ అప్ డేట్ తో పండగ చేసుకుంటున్నారు తలైవా ఫ్యాన్స్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ డీ ఇమ్మాన్ సౌండ్ ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడు. అన్నాత్తే దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కాబోతుంది. రజినీకాంత్ మరోవైపు అన్నాత్తే తర్వాత చేయబోయే సినిమా కూతురు సౌందర్య డైరెక్షన్ లో ఉంటుందని ఇప్పటికే తెరపైకి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే కొత్త సినిమాకు సంబంధించి రజినీకాంత్ కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే. సౌందర్య ఇప్పటికే రజినీకాంత్ తో యానిమేటెడ్ యాక్షన్ సినిమా కొచ్చాడైయాన్ ను డైరెక్ట్ చేసింది.
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!