Raaka | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ విజయానంతరం చేస్తున్న ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సెన్సేషనల్ దర్శకుడు అట్లీతో ఆయన చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకు ‘రాకా’ అనే టైటిల్‌ను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని విధంగా పూర్తిగా భిన్నమైన అవతార్‌లో కనిపించారు. గుండుతో, కళ్లకు కాటుకతో, రగ్గడ్ స్కిన్ టెక్స్చర్తో, భయంకరమైన లుక్‌తో ఆయన ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తున్నారు.
అత్యంత ఆసక్తికరంగా కనిపించిన అంశం ఆయన చేతుల డిజైన్. తోడేలు కాళ్లను తలపించేలా ఉన్న చేతులు, పెద్ద గోర్లు ఈ సినిమా ఫాంటసీ లేదా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఉండొచ్చని సూచిస్తున్నాయి. అలాగే నుదుటిపై ఉన్న వికింగ్ తరహా టాటూలు, అడవి వాతావరణాన్ని తలపించే లుక్ కలిపి అట్లీ ఈ సినిమా కోసం ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడని అర్థమవుతోంది. అయితే పోస్టర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలైంది. ముఖ్యంగా ఈ లుక్ 2016లో వచ్చిన కాష్మోరా సినిమాలో కార్తీ పోషించిన రాజ్‌నాయక్ పాత్రను పోలి ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. “అట్లీ మళ్లీ కాపీ ట్రాక్‌లో నడుస్తున్నాడా?” అంటూ కొందరు విమర్శిస్తుండగా, “బన్నీ లుక్ డూప్లికేట్లా ఉంది” అని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.
దీనికి అల్లు అర్జున్ అభిమానులు మాత్రం గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. “ఇది కేవలం పోస్టర్ మాత్రమే, సినిమాలో అసలు విశ్వరూపం ఇంకా చూడాల్సి ఉంది” అంటూ తమ హీరోపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సుమారు ₹800 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. హీరోయిన్గా దీపికా పదుకొణె నటిస్తున్నట్లు సమాచారం. అలాగే రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. పునర్జన్మల కాన్సెప్ట్‌తో డార్క్ మిస్టరీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్, డీ-ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.