అర్థరాత్రి రిలీజ్ కానున్న కనెక్ట్ మూవీ ట్రైలర్.. ఇండియన్ సినీ చరిత్రలో ఇదే మొదటి సారి..!
లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుపుతుంది. ఇటీవలే 'గాడ్‌ఫాదర్'తో మంచి విజయం సాధించిన నయన్.. ఇప్పుడు కనెక్ట్ అనే హార్రర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమైంది.
Connect Movie Trailer | లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుపుతుంది. ఇటీవలే గాడ్‌ఫాదర్‌తో మంచి విజయం సాధించిన నయన్.. ఇప్పుడు కనెక్ట్ అనే హార్రర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమైంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మహిళా ప్రధానంగా సాగే ఈ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్డేట్ను ప్రకటించారు.
ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం అర్ధరాత్రి 12గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇలా అర్ధరాత్రి ఇప్పటివరకు ఏ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయలేదు. హర్రర్ సినిమా కావడంతో ఆ టైమ్‌కు ట్రైలర్ రిలీజ్ చేస్తే ఇంకా మంచి బజ్ ఏర్పడుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇటీవలే రిలీజైన టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయనతార భర్త విఘ్నేష్ శివన్ నిర్మించాడు. ఈ సినిమాను తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తుంది.
మయూరి వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నయనతార, అశ్విన్ కాంబోలో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సత్యరాజ్, అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

