Comedy is difficult | కామెడీ చేయడం కష్టం

ఓటీటీ మాధ్యమాల కారణంగా నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని అన్నారు నటుడు రాజా రవీంద్ర. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. సత్తిబాబు దర్శకుడు. ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో రాజారవీంద్ర పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఆర్ఆర్ఆర్ అనే ముగ్గురు స్నేహితుల కథ ఇది. ఇందులో నేను రాజుగారు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కనిపిస్తా. యాభై ఏళ్ల వయసు దాటిన అతడు భార్యాపిల్లలు తనను నిర్లక్ష్యం చేస్తున్నారని మధనపడుతుంటారు. ఓ సింగర్ పట్ల ఆకర్షితుడైన రాజు సోషల్‌మీడియాలో ఆమెతో చాటింగ్ చేయడం మొదలుపెడతాడు. ఆ పరిచయం అతడి జీవితంలో ఎలాంటి సమస్యల్ని తీసుకొచ్చిందనేది ఈ చిత్ర ఇతివృత్తం. ఆద్యంతం నవ్వించే చిత్రమిది. హాస్యాన్ని పండించడం కంటే విలన్‌గా నటించడమే నా దృష్టిలో సులభం. కామెడీ పాత్రలకు హావభావాలు, టైమింగ్ కుదరాలి. అప్పుడే పాత్ర బాగా పండుతుంది. ప్రస్తుతం ‘ఆచార్య’, ‘రామారావు ఆన్ డ్యూటీ’తో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నా’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

