కమెడియన్ సత్య హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘జెట్లీ’. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చిరంజీవి(చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. మే 1న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ట్రైలర్ను విడుదల చేశారు. ఇందులో జ్ఞాపకశక్తి కోల్పోయి తనను తాను పెద్ద యాక్షన్ హీరోగా ఊహించుకుంటూ నవ్వులు పండించాడు సత్య.
యాక్షన్ సన్నివేశాల్లో కూడా చక్కటి హాస్యం పండింది. ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాను సత్యతో తీస్తే ఎలా ఉంటుందో ‘జెట్లీ’ అలా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో ప్రతీ పాత్ర నవ్విస్తుందని సత్య అన్నారు. 80శాతం ఫ్లైట్లోనే షూట్ చేశామని, తెలుగులో ఇప్పటివరకు ఇదొక ప్రయోగమని నిర్మాత చెర్రీ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.