నాని మూడు సిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా..!

నేచురల్ స్టార్ నాని గత ఏడాది వి అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలసిందే. కరోనా వలన వి చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఇక ఈ ఏడాది మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇందులో టక్ జగదీష్ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, కరోనా వాలన కొద్ది రోజులు వాయిదా వేశారు. ఇక శ్యామ్ సింగరాయ్ అనే చిత్రం కూడా తుది దశకు చేరుకుంది. మరి కొద్ది రోజులలో ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు.
నాని నటిస్తున్న ఫన్ ఎంటర్టైనర్ అంటే సుందరానికి చిత్ర షూటింగ్ కూడా మరి కొద్ద రోజులలో మొదలు కానుంది. వీలైతే ఈ ఏడాది లేదంటే వచ్చే ఏడాది మొదట్లో చిత్రాన్ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అయితే ఇప్పుడు నాని చేతిలో మూడు సినిమాలలో ఉన్న కామన్ పాయింట్ గమనిస్తే మూడు చిత్రాలు ఆయా చిత్రాల దర్శకులకు మూడో సినిమా. శివ నిర్వాణ గతంలో నిన్ను కోరి, మజిలి చిత్రం చేయగా ఇప్పుడు మూడో చిత్రంగా టక్ జగదీష్ చేశాడు. ఇక రాహుల్ సంకీర్తయాన్ ది ఎండ్, సంకీర్తయాన్ అనే చిత్రాలు చేశాడు. ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక అంటే సుందరానికి చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ గతంలో మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా చిత్రాలు చేశాడు. మూడో సినిమాను నానితో చేయనున్నాడు. ఇలా ముగ్గురు దర్శకులకు నాని చిత్రాలు మూడోవి కాగా, అవి ఎంత విజయం సాధిస్తాయో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

