తను చేసే సినిమాల్లో వైవిధ్యం ఉండాలని కోరుకునే హీరోల్లో ప్రభాస్ ఒకరు. ఆయన గత కొన్నేళ్లుగా చేస్తున్న చిత్రాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ‘బాహుబలి’, ‘సాహో’,‘రాధే శ్యామ్’ ఇవన్నీ వేటికవి భిన్నమైన సినిమాలు. ఇక రాబోయే చిత్రాలు కూడా అదే వెర్సటాలిటీతో ఉన్నాయి. ‘ఆది పురుష్’ ఇతిహాస నేపథ్య చిత్రం కాగా, ‘సలార్’ యాక్షన్ ఎంటర్ టైనర్, ‘ప్రాజెక్ట్ కె’ సైంటిఫిక్ థ్రిల్లర్, ‘స్పిరిట్’ పవర్ఫుల్ పోలీస్ కథ.
వీటన్నింటికీ భిన్నంగా ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా గురించి ఇటీవల దర్శకుడు మారుతి స్పందించాడు. ‘ప్రభాస్‌ను ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లో చూసి చాలా రోజులైంది. అలాంటి ఫన్ ఫిల్మ్ మా కాంబినేషన్లో చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడున్న ఆయన కెరీర్లో ఇదొక కొత్త ఫీలింగ్ ఇచ్చే సినిమా అవుతుంది’ అన్నారు.