Salman Khan: సల్మాన్‌ఖాన్‌ను అడ్డుకున్న సీఐఎస్ఎఫ్ ఆఫీసర్‌కు రివార్డు !

న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ( Salman Khan ) ను.. కొన్ని రోజుల క్రితం ముంబై విమానాశ్రయంలో అక్కడ పనిచేస్తున్న సీఐఎస్ఎఫ్ జవాను అడ్డుకున్న విషయం తెలిసిందే. టైగర్-3 సినిమా షూటింగ్ కోసం రష్యా వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన సల్మాన్.. కారు దిగి నేరుగా టర్మినల్లోకి ఎంటర్ అవుతున్న సమయంలో అక్కడ ఉన్న సీఐఎస్ఎఫ్ సెక్యూర్టీ జవాను అడ్డుకున్నారు. సల్మాన్‌తో పాటు ఆయనతో ఉన్న పలువుర్ని డాక్యుమెంట్ చూపించాలని జవాను ఆదేశించారు.
అయితే జవానుకు అడ్డు చెప్పలేకపోయిన సల్మాన్.. డాక్యుమెంట్లు చూపించాకే లోపలికి వెళ్లాడు. ఈ ఘటనపై ఇటీవల ఓ కథనం వచ్చింది. సల్మాన్‌ను అడ్డుకున్న జవాను ఫోన్‌ను సీజ్ చేసినట్లు స్టోరీ రాశారు. దానిపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూర్టీ ఫోర్స్ క్లారిటీ ఇచ్చింది. సీఐఎస్ఎఫ్ ఆఫీసర్‌ను మందలించలేదని, కానీ అతనికి సరైన రివార్డును ప్రకటించినట్లు సీఐఎస్ఎఫ్ తాజాగా తన ట్వీట్లో పేర్కొన్నది. విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆ ఆఫీసర్ అద్భుతమైన ప్రొఫెషనలిజం కనబరిచాడని, అందుకే ఆయన్ను సత్కరించినట్లు సీఐఎస్ఎఫ్ చెప్పింది.
సెక్యూర్టీ చెకింగ్ జరగకుండానే లాబీలోకి వెళ్తున్న సల్మాన్‌ను అడ్డుకున్న జవానుపై ఇంటర్నెట్లో ప్రశంసలు కురుస్తున్నాయి. మరో వైపు సల్మాన్, కత్రినా మధ్య టైగర్-3 షూటింగ్ రష్యాలో జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో రా ఏజెంట్ పాత్రలో సల్మాన్ నటిస్తున్నాడు.
The contents of this tweet are incorrect & without factual basis. In fact, the officer concerned has been suitably rewarded for exemplary professionalism in the discharge of his duty. @PIBHomeAffairs
— CISF (@CISFHQrs) August 24, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

