Jani Master | తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎన్నికయ్యారు. జానీ మాస్టర్ ప్రమాణస్వీకారానికి దక్షిణాది డ్యాన్స్ డైరెక్టర్లందరూ హాజరయ్యారు. నిర్మాత మండలి అధ్యక్షుడు, ఫిలింఛాంబర్ సెక్రటరీ కె.ఎల్.దామోదరప్రసాద్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. సభ్యుల మంచికోసం గెలిచిన అభ్యర్థులు పనిచేయాలని, ఈ అసోసియేషన్‌కి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని, పాతవాళ్లను మరిచిపోకుండా ముక్కురాజుగారి కుటుంబసభ్యులను కూడా పిలవడం సంతోషంగా ఉందని దామోదరప్రసాద్ ఆన్నారు.
‘నన్ను దీవించడానికి వచ్చిన సాటి డ్యాన్స్ డైరెక్టర్లందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మాకు ఇంత పేరు వచ్చిందంటే, అందరం కార్లలో తిరుగుతున్నామంటే కారణం ముక్కురాజు మాస్టారు. ఆయన దయవల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం. మేం పిలవగానే ఆయన కుటుంబం నుంచి ఒకరు ఈ కార్యక్రమానికి వచ్చారు. మా డ్యాన్స్ యూనియన్‌లో అందరం ఒక్కటే. మేమంతా ఒక తల్లి బిడ్డలం. మేం వేసే ప్రతి అడుగూ డ్యాన్స్ యూనియన్ అభివృద్ధివైపే ఉంటుంది. యూనియన్‌కి భూమి తీసుకొచ్చే బాధ్యత నాది’ అని జానీ మాస్టర్ చెప్పారు. ఇంకా దినేశ్ మాస్టర్ కూడా మాట్లాడారు.