Singeetam Srinivasa rao | సింగీతం శ్రీనివాసరావు మృతిపై చిరంజీవి భావోద్వేగం.. ఆయన మృతి సినీ పరిశ్రమకి తీరని లోటన్న పవన్
Singeetam Srinivasa rao | ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగీతం శ్రీనివాసరావును నిజమైన దార్శనికుడిగా అభివర్ణిస్తూ ఆయనతో తన అనుబంధాన్ని, సినీ రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు చిరంజీవి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
Singeetam Srinivasa rao | ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగీతం శ్రీనివాసరావును నిజమైన దార్శనికుడిగా అభివర్ణిస్తూ ఆయనతో తన అనుబంధాన్ని, సినీ రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు చిరంజీవి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. సింగీతం శ్రీనివాసరావు మృతి తనను తీవ్రంగా కలచివేసిందని చిరంజీవి తెలిపారు. కొత్త ఆలోచనలను అన్వేషించడంలో ఆయన చూపిన ఊహాశక్తి, ధైర్యం భారతీయ సినిమాకు ఎన్నో మరపురాని చిత్రాలను అందించాయని కొనియాడారు. సినీ రంగానికి సింగీతం చేసిన సేవలను ఎప్పటికీ ఎంతో గౌరవంతో, ఆప్యాయతతో గుర్తుచేసుకుంటామని పేర్కొన్నారు.
ఇటీవల సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ‘సింగ్ గీతం’ సినిమాను కూడా చిరంజీవి ప్రస్తావించారు. ఆ చిత్రం ద్వారా ఆయనలో కథలు చెప్పాలనే తపన ఎంత బలంగా ఉందో మరోసారి రుజువైందని అన్నారు. వయసు పెరిగినా మనసులో మాత్రం సింగీతం ఎప్పుడూ యువకుడిగానే ఉండేవారని చిరంజీవి గుర్తుచేశారు.కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి, కొత్తగా ఏదైనా సృష్టించాలనే తపన సింగీతం శ్రీనివాసరావులో చివరి వరకు కొనసాగాయని చిరంజీవి అన్నారు. అలాంటి సృజనాత్మక దార్శనికుడిని కోల్పోవడం తెలుగు, భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. సింగీతం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు చిరంజీవి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సింగీతం గారిని తామంతా మిస్ అవుతామని, అయితే ఆయన తెరకెక్కించిన సినిమాలు తరతరాల ప్రేక్షకులతో ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటాయని అన్నారు. చివరగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ‘ఓం శాంతి’ అంటూ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
భారతీయ చలన చిత్ర పరిశ్రమకు సింగీతం శ్రీనివాసరావు విభిన్నమైన చిత్రాలను అందించారని పవన్ కల్యాణ్ అన్నారు. ‘పుష్పక విమానం’, ‘విచిత్ర సోదరులు’, ‘మయూరి’, ‘ఆదిత్య 369’, ‘మైకేల్ మదన కామరాజు’ వంటి చిత్రాల్లో ఆయన చేసిన ప్రయోగాలు, చూపిన సృజనాత్మకత ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. . అలాగే ‘అమెరికా అమ్మాయి’, ‘పంతులమ్మ’ వంటి చిత్రాల్లోని గీతాలు కూడా విశేష ప్రజాదరణ పొందాయని పవన్ కల్యాణ్ తెలిపారు. 94 ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించడం ద్వారా ఆయనకు సినిమాపై ఉన్న అంకితభావం, ఆసక్తి స్పష్టమవుతాయని అన్నారు. సింగీతం శ్రీనివాసరావు మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘స్పెషల్’ పెట్టకుండానే బాదుడు.. బస్ పాయింట్లలో కనిపించని రెగ్యులర్ బస్సులు!
Cyber Attack | సైబర్ ‘సెక్యూరిటీ’ ఏది?.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లపై యథేచ్ఛగా దాడులు
పాడి, కోళ్ల పరిశ్రమపై కరువు పంజా.. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ
Stock Market Tips | స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
Israel Elections | నెతన్యాహు భవితవ్యం ఏంటో.. రేపే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

