ఈ ఏడాది ‘మనశంకర వరప్రసాద్‌గారు’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను సాధించి మంచిజోష్లో ఉన్నారు అగ్ర నటుడు చిరంజీవి. ప్రస్తుతం ఆయన తన 158వ సినిమా సన్నాహాల్లో ఉన్నారు. బాబీ కొల్లి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఇదిలావుండగా ‘విశ్వంభర’ సినిమా రిలీజ్ కోసం మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
షూటింగ్ పూర్తయి చాలా రోజులైనా..గ్రాఫిక్స్ పనుల వల్ల ఈ సినిమా విడుదలలో జాప్యాన్ని ఎదుర్కొంటున్నది. తా జా సమాచారం ప్రకారం స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా తాలూకు గ్రాఫిక్స్ వర్క్ తుదిదశకు చేరుకుందని తెలిసింది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది.