పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) విడుదలైన అన్ని సెంటర్లలో సక్సెస్ఫుల్ టాక్‌తో ప్రదర్శించబడుతోంది. మెగా అభిమానులు, పవన్ ఫాలోవర్లు, మూవీ లవర్స్ భీమ్లానాయక్ సినిమాను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే భీమ్లానాయక్ సినిమాపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మతోపాటు గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా సోదరుడు నటించిన ఈ మూవీని వీక్షించి..తెగ ఎంజాయ్ చేశాడు.
ట్విటర్లో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ భీమ్లా నాయక్ టీంకు శుభాకాంక్షలు తెలియజేశాడు. అభిమానులు రెగ్యులర్ ఉపయోగించే పవర్ స్టార్మ్ పదాన్ని వాడుతూ సినిమా ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పేశాడు. ట్రైలర్ విడుదల సందర్భంగా మేకర్స్ గాడ్ ఫాదర్ గెటప్‌లో ఉన్న చిరు, భీమ్లా నాయక్ గెటప్‌లో ఉన్న పవన్ కల్యాణ్ లొకేషన్లో కలిసి సందడి చేసిన వీడియోను షేర్ చేయగా నెట్టింట్లో ఇప్పటికే వైరల్ అవుతోంది.
Heartiest Congratulations on the Thumping Success of #BheemlaNayak True Power Storm! 👏👏👏@PawanKalyan #Trivikram @RanaDaggubati @saagar_chandrak@MusicThaman @MenenNithya @iamsamyuktha_ @dop007 @NavinNooli @SitharaEnts pic.twitter.com/a0U1hs8zGV
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 25, 2022
ఇవాళ అందరిలాగే భీమ్లా నాయక్ సినిమా చూసి ఎక్జయిట్‌మెంట్‌తో భీమ్లా నాయక్‌ను చిరంజీవి ఆకాశానికెత్తుతూ పెట్టిన ట్వీట్ ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది.