తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం

అగ్ర నటుడు చిరంజీవికి ద్విపాత్రాభినయం కొత్తేమీ కాదు. గతంలో ఆయన చాలా చిత్రాల్లో డ్యూయల్ రోల్లో కనిపించి అభిమానుల్ని మెప్పించారు. తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ మరోమారు ద్విపాత్రాభినయానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. వివరాల్లోకి వెళితే…చిరంజీవి కథానాయకుడిగా కె.ఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. కుటుంబ అనుబంధాలు, యాక్షన్ అంశాల కలబోతగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని తెలిసింది. ఇందులో చిరంజీవి తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని సమాచారం. కథానుగుణంగా రెండు పాత్రలకు సమప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకుడు. ఈ సినిమా పూర్తయిన అనంతరం చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్‌లో నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాతే బాబి దర్శకత్వం వహించనున్న సినిమా పట్టాలెక్కుతుందని చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- boby
- Chiranjeevi
- duel role
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

