అమీర్‌ఖాన్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా తెలుగు వెర్షన్‌కు సమర్పకులుగా వ్యవహరించనున్నారు స్టార్ హీరో చిరంజీవి. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నా స్నేహితుడు ఆమిర్‌ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ చిత్ర తెలుగు వెర్షన్‌కు సమర్పకులుగా ఉండటం గౌరవంగా భావిస్తున్నా. భావోద్వేగాలతో సాగే ఈ కథ తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’ అని ట్వీట్ చేశారు. ఇటీవల తన నివాసంలో ఆమిర్ ఖాన్‌తో కలిసి ఈ సినిమా ప్రివ్యూ చూశారు చిరంజీవి. సినిమా తనకు బాగా నచ్చడంతో ప్రెజెంటర్‌గా ఉండేందుకు ముందుకొచ్చారు. ఈ ప్రివ్యూలో సుకుమార్, రాజమౌళి, నాగ చైతన్య పాల్గొన్నారు. మీ నటన బాగుందంటూ ఆమిర్, నాగ చైతన్యను చిరంజీవి అభినందించారు. ఆగస్ట్ 11న ఈ సినిమా హిందీ సహా దక్షిణాది భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఫారెస్ట్ గంప్’ అనే హాలీవుడ్ సినిమా రీమేక్‌గా దర్శకుడు అద్వైత చందన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కరీనా కపూర్ నాయికగా నటిస్తున్నది. ఈ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెడుతున్నారు నాగచైతన్య.