మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ ‘విశ్వంభర’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియోకు అద్భుతమైన స్పందన లభించింది. త్వరలో ఈ సినిమా షూటింగ్లో చిరంజీవి జాయిన్ కాబోతున్నారు. ఈ సినిమా సన్నద్ధతలో భాగంగా జిమ్‌లో చెమటోడుస్తూ సోషల్‌మీడియాలో చిరంజీవి పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
సినిమా పట్ల ఆయన కమిట్మెంట్కు నిదర్శనమిదని అభిమానులు పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ‘గెట్టింగ్ రెడీ ఫర్ విశ్వంభర’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్‌ను జోడించారు చిరంజీవి. సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌గా..పంచభూతాలు, ముల్లోకాల కాన్సెప్ట్‌కు ఆధ్యాత్మిక అంశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఛోటా కె నాయుడు, సంగీతం: యం.యం.కీరవాణి, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్.