ఇండస్ట్రీకి తలలో నాలుక లాంటి వ్యక్తి బీఏ రాజు: చిరంజీవి

గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు కన్నుమూసారు. శుక్రవారం రాత్రం పీఆర్వో, నిర్మాత బీఏ రాజు గుండెపోటుతో మరణించగా, ఆయన మరణ వార్త తెలుసుకొని ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. బీఏ రాజు మృతిపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేశారు. ఇండస్ట్రీకి తలలో నాలుక లాంటి వ్యక్తి బీఏ రాజు లేరని వార్త తెలిసి షాక్‌కు గురయ్యాను అని అన్నారు చిరు.
బీఏ రాజు.. ఈ పేరు తెలియని వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండరు. మద్రాసులో ఉన్నప్పుడు సినీపరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని ఆయన నాతో షేర్ చేసుకునేవారు. ప్రతి కొత్త విషయాన్ని ఆయన నుంచి తెలుసుకునేవాడిని.. ఆన్ లొకేషన్ షూటింగ్ స్పాట్ లో వచ్చి నాతో చాలా సరదాగా ముచ్చటించేవారు. చాలా విషయాల్ని మాట్లాడుకునేవాళ్లం. నా చాలా సినిమాలకు ఆయన పీఆర్ వోగా పని చేశారు. సినిమా సమస్త సమాచారం.. ఎన్నో సంవత్సరాల క్రితం రిలీజైన క్లాసిక్స్ కి సంబంధించిన కలెక్షన్స్ ట్రేడ్ రిపోర్ట్ రికార్డుల గురించి యథాతథంగా చెప్పగల గొప్ప నాలెజ్ బ్యాంక్ ఆయన.
ఏ సినిమా ఏ తేదీన రిలీజైంది? ఆ సినిమా ఎంత వసూలు చేసింది? అన్న లెక్కల్ని కచ్ఛితంగా చెప్పేవారు. ఏ సెంటర్ లో ఎంత వసూలు చేసింది? ఎన్నిరోజులు ఆడింది.. చెప్పేవారు. 100 రోజులు 175 రోజులు 200 రోజులు అంటూ ప్రతిదీ పరిశ్రమకు ఎన్ సైక్లోపెడియాలా సమాచారం అందించిన పత్రికా జర్నలిస్ట్.. మేధావి.. సూపర్ హిట్ సినీమ్యాగజైన్ కర్త ఆయన. చాలా సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన బీఏ రాజుగారు ఉండడం పరిశ్రమ అదృష్టం. అలాంటి వ్యక్తి నేడు లేరని తెలిసి షాక్‌కు గురయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
ఇవి కూడా చదవండి..
కూలిన సొరంగం.. నలుగురు కూలీలు మృతి
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత బీఏ రాజు కన్నుమూత
నేపాల్ పార్లమెంట్ రద్దు.. నవంబర్‌లో ఎన్నికలు
తెలంగాణకు వర్ష సూచన
విలక్షణ నటుడు చంద్రమోహన్ జన్మదినోత్సవాలు
Vaccination @ 126 Day’s.. 19.32 కోట్ల డోసుల పంపిణీ
ఆన్లైన్ పాఠాలు బాగు
‘ఎయిరిండియా’పై సైబర్ ఎటాక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- BA Raju
- Chiranjeevi
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

