అగ్ర నటుడు చిరంజీవి, రచయిత సత్యానంద్ల అనుబంధం ఈనాటిది కాదు. చిరంజీవి కెరీర్లో అత్యధిక చిత్రాలకు రచన చేసిన క్రెడిట్ సత్యనంద్ది. రచయితగా సత్యానంద్ 50ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, తన అభిమాన రచయితను ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించి, సత్కరించారు.
‘ సినిమాను జీవన విధానంగా మార్చుకున్న నిత్య విద్యార్థి సత్యానంద్, నా ఎన్నో చిత్రాలకు అద్భుతమైన సంభాషణలను అందించారాయన. నాలాగా ఎంతో మంది నటీనటుల అభ్యున్నతికి కారణమయ్యారు. యాభైఏళ్ల రచనాప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఈ సరస్వతీపుత్రుడ్ని సత్కరించుకోవడం ఓ భాగ్యం.’ అంటూ తన ట్విటర్లో కూడా పోస్ట్ చేశారు చిరంజీవి. ఈ సందర్భంగా సత్యానంద్ని సత్కరిస్తున్న ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు.