క్రేజీ గాసిప్.. చిరంజీవి-బాబీ సినిమా ఆ మలయాళ సినిమాకు రీమేక్..?

Chiranjeevi-Bobby film | మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు బాబీ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు.. ఇప్పుడు అభిమానులతో పాటు ఇండస్ట్రీలో కూడా ఇదే ఆసక్తి పుట్టించే విషయం. డైరెక్టర్ కేఎస్ రవీంద్ర ఉరఫ్ బాబీ ఎలాంటి కథను చెప్పి అన్నయ్యను ఒప్పించి ఉంటాడు? అంతగా పూనకాలు తెప్పించే కథ ఏమై ఉంటుంది అని అందరూ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. ఇప్పటికే ఆచార్య పూర్తయింది. గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. దీంతో పాటే బాబీ సినిమాను కూడా మొదలు పెడుతున్నాడు చిరంజీవి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతోంది. డిసెంబర్ నుంచి బాబీ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ మధ్య పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్‌కు ముస్తాబైంది చిరు-బాబీ సినిమా.
చిరంజీవి- బాబీ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే మెగాస్టార్ చిరంజీవికి ఈ టైటిల్ అంతగా నచ్చలేదు అని తెలుస్తోంది. దాంతో చిరంజీవి ఇమేజ్‌కు సరిపోయేలా వాల్తేరు శీను అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు మెగా వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఈ టైటిల్ వినగానే చిరంజీవి కూడా ఓకే చెప్పాడని.. గో హెడ్ అంటూ బాబీకి చెప్పినట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఓ స్టార్ హీరో, అభిమాని మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాగా ఇది తెరకెక్కబోతుంది. ఇందులో రవితేజ కీలక పాత్రలో నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో చిరంజీవి చేపలు పట్టే వ్యక్తి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఫస్ట్ లుక్ పోస్టర్లో ఓడ, సముద్రం హైలెట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఒక కొత్త ప్రచారం మొదలైంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాకు ఇది అనధికారిక రీమేక్ అని తెలుస్తోంది. ఒక హీరో అభిమాని మధ్య జరిగే ఈగో క్లాష్‌పై ఆ సినిమా కథ నడుస్తుందని సమాచారం. ఇప్పుడు చిరంజీవి సినిమాలో కూడా ఇదే కథ ఉండబోతోందని తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో పని చేసిన అనుభవం ఉండటంతో చిరంజీవిని కూడా బాగానే హ్యాండిల్ చేస్తాడని మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు. 2022 ఆగస్టు 22 చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Chiranjeevi: చిరంజీవి చెల్లెలుగా సీనియర్ హీరోయిన్.. ట్విస్ట్ బాగుంది..!
చిరంజీవి-సల్మాన్‌ఖాన్ స్పెషల్ సాంగ్ ఉండబోతుందా..?
Keerthy Suresh: చెల్లెలు పాత్ర కోసం రెండు కోట్ల రెమ్యునరేషనా..!
మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా ఫిక్స్.. నిర్మాత ఎవరో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

