Jinn | తెలుగులో సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్ సినిమాలను చూసే మూవీ లవర్స్ సంఖ్య ఎక్కువే ఉంటుందని తెలిసిందే. సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో భయపెట్టించే నయా ఫీల్ అందించే లైన్లో వస్తోన్న చిత్రం జిన్ (Jinn). చిన్మయ్ రామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అమిత్ రావ్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. వరదరాజ్ చిక్‌బళ్లాపుర డైలాగ్స్ అందిస్తున్న ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్ నెట్టింట హైప్ క్రియేట్ చేస్తోంది.
ఫస్ట్ లుక్ పోస్టర్లో హాలీవుడ్ సినిమాలా ఘోస్ట్‌ను తలపించే విగ్రహంతోపాటు బ్యాక్ డ్రాప్లో కూడా భయాన్ని రేకెత్తించేలా ఉన్న వింత ఆకారాలను చూడొచ్చు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ మూవీలో పర్వీజ్ సింబా, ప్రకాశ్ తుంబినాడు, రవి భట్, సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ మూవీని కథానుగుణంగా హైదరాబాద్‌తోపాటు పలు లొకేషన్లలో షూట్ చేశారట మేకర్స్. బలమైన కంటెంట్‌తో అన్ని రకాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండబోతుందన్న ఈ చిత్రానికి అలెక్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిఖిల్ ఎం గౌడ నిర్మిస్తున్నారు.
The fiery gates of #Jinn are opening… 🔥
Worldwide Release on Dec 19th 👻
Don’t miss it in theatres near you. pic.twitter.com/kGIKquvCXr
— Telugu Film Producers Council (@tfpcin) December 11, 2025
Akhanda 2 | రిలీజ్‌కి కొద్ది గంటల ముందు విడుదలైన శివ శివ సాంగ్..హార్ట్ టచింగ్‌గా ఉన్న లిరిక్స్
అఖండ2 సినిమా ప్రీమియర్ షోలకు టిక్కెట్ ధర పెంపు జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు
Pragathi | ఈ వయస్సులో నీకు అవసరమా అన్న వాళ్లకి ఇదే నా సమాధానం.. ప్రగతి ఫైరింగ్ స్పీచ్