అందరూ సమ్మతించే సినిమా ఇది
‘తెలుగు సినిమా సత్తా నేడు ప్రపంచానికి తెలిసిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు సినీరంగానికి పూర్తిస్థాయిలో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అందరిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాకు ‘సమ్మతమే’ అనే టైటిల్‌ను పెట్టడం సంతోషంగా ఉంది’ అని అన్నారు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘సమ్మతమే’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయనతో పాటు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రవీణ కంకణాల నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ‘ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. అందరికీ సమ్మతమయ్యే చిత్రమనిపించింది’ అన్నారు. హీరో కిరణ్ వ్యక్తిత్వం తనకు బాగా నచ్చుతుందని..అందుకే గీతా ఆర్ట్స్ ద్వారా చిత్రాన్ని విడుదల చేస్తున్నామని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. థియేటర్లలో చూసి ఆస్వాదించే సకుటుంబ కథా చిత్రమిదని నిర్మాత కంకణాల ప్రవీణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, గాదరి కిషోర్, నిర్మాత బన్నీ వాసు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

