Ganesh Acharya | కొరియోగ్రఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో ఛార్జీషీటు..!
కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య (Ganesh Acharya) తనను వెంబడిస్తూ..లైంగికంగా వేధించారని ఆయన కో డ్యాన్సర్ 2020లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
బాలీవుడ్ (Bollywood)తోపాటు దాదాపు అన్నిసినీ పరిశ్రమల్లో పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య (Ganesh Acharya). ఇటీవలే అల్లు అర్జున్ నటించిన పుష్పలోని ఊ అంటావా ఊఊ అంటావా (Oo Antava) పాటకు నృత్య రీతులు సమకూర్చాడు. గణేశ్ ఆచార్య తనను వెంబడిస్తూ..లైంగికంగా వేధించారని ఆయన కో డ్యాన్సర్ 2020లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తాజాగా ఇదే కేసులో ముంబై పోలీసులు ఛార్జీ షీటు ఫైల్ చేశారని బీటౌన్ వర్గాల సమాచారం.
ఒషివారా పోలీస్ స్టేషన్ ( Oshiwara Police station) పరిధిలో ఉన్న ఈ కేసుకు సంబంధించి ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు లో ఛార్జీషీటు దాఖలైంది. గణేశ్ ఆచార్యపై ఐపీసీ సెక్షన్ 354-ఏ, 354 సీ, 354డీ, 509, 323, 504, 506కి కింద కేసు నమోదైనట్టు తెలుస్తోంది. అయితే తాజా పరిణామాలపై మాట్లాడేందుకు గణేశ్ ఆచార్య విముఖత వ్యక్తంచేశాడు. ఆయన తరపు లాయర్ రవి సూర్యవంశి మాట్లాడుతూ..ఎఫ్ఐఆర్లో నమోదైన కేసులు బెయిల్ వచ్చేవేనన్నారు.
కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపులను తాను తిరస్కరించినట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో డ్యాన్సర్ పేర్కొంది. గణేష్ ఆచార్య తనను వేధించాడని, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని, తనకు అశ్లీల కంటెంట్‌ను కూడా చూపించాడని ఆరోపించింది. అంతేకాదు తాను ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఫిజికల్ రిలేషన్ కొనసాగించాలని ఒత్తిడి చేశాడని ఆరోపణలు చేసింది.
గణేశ్ ఆచార్య మహిళా అసిస్టెంట్లు నన్ను కొట్టారు..నాపై దుర్భాషలాడి..పరువు తీశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఈ కేసును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు న్యాయవాదిని సంప్రదించానని బాధిత మహిళ పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

