Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో తొలి వారం నామినేషన్ ప్రక్రియ హాట్‌హాట్‌గా సాగుతోంది. హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలి రోజు నుంచే కంటెస్టెంట్ల మధ్య విభేదాలు మొదలవగా.. నామినేషన్స్ ప్రక్రియతో అవి మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ఎవరెవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఎవరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది? అనే విషయాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.ఇక ఇప్పుడు అందరి దృష్టి తొలి వారం ఎలిమినేషన్‌పైనే ఉంది. ఈ సీజన్లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో 10 మంది సెలబ్రిటీలు కాగా.. ఆరుగురు సామాన్యుల నుంచి ఎంపికైనవారు. మరి తొలి వారంలో సెలబ్రిటీ ఎలిమినేట్ అవుతారా? లేక కామన్ మ్యాన్ కంటెస్టెంట్ బయటకు వస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
తొలి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఒకరు ఇప్పటికే హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఓటింగ్ సరళి ఆధారంగా ఎలిమినేషన్ జరిగినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది అధికారికంగా ధృవీకరించబడిన సమాచారం కాదు. బిగ్‌బాస్ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎలిమినేషన్‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు. ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం.. హౌస్మేట్స్ ఛాయిస్ ఓటింగ్‌లో భాగంగా ఆటో రామ్ ప్రసాద్, చరణ్ మహాదేవ్ మధ్య పోటీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసే బాధ్యతను మిగిలిన హౌస్‌మేట్స్‌కు అప్పగించినట్లు సమాచారం.
ఈ ప్రక్రియలో రామ్ ప్రసాద్‌కు ఎక్కువ మంది హౌస్మేట్స్ మద్దతు లభించిందని.. దీంతో చరణ్ మహాదేవ్‌ను ఎలిమినేట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చరణ్ మహాదేవ్ కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. అలాంటి కంటెస్టెంట్ తొలి వారంలోనే ఎలిమినేట్ అయితే.. ఈ సీజన్లో ఇది ఆసక్తికరమైన పరిణామంగా మారే అవకాశం ఉంది. మరోవైపు రామ్ ప్రసాద్‌కు హౌస్‌లో మంచి మద్దతు లభిస్తోందనే చర్చ కూడా జరుగుతోంది. హౌస్‌లో ఆయన వ్యవహరిస్తున్న తీరు, ఇతర కంటెస్టెంట్లతో ఏర్పడుతున్న అనుబంధం ఓటింగ్‌పై ప్రభావం చూపినట్లు అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రతి వారం మాదిరిగానే శనివారం ఎపిసోడ్లో నాగార్జున హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్ల ఆటతీరుపై మాట్లాడనున్నారు. తప్పులు చేసిన వారికి క్లాస్ తీసుకోవడంతో పాటు.. నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లలో కొందరిని ఒక్కొక్కరిగా సేవ్ చేస్తూ ఎలిమినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆదివారం ఎపిసోడ్లో మిగిలిన కంటెస్టెంట్లలో ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది