NTR Neel | టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటిస్తోన్న NTR Neel మూవీ. ఈ చిత్రంలో సప్తసాగరాలు దాటి ఫేం రుక్మిణి వసంత్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తిర అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ మూవీ స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నారన్న వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సీఈవో చెర్రీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. జెట్లీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెర్రీ మాట్లాడుతూ.. ప్రస్తుతం జెట్స్పీడ్తో షూటింగ్ జరుగుతోంది.. ముందుగా ప్రకటించిన తేదీ నాటికి సినిమాను పూర్తి చేస్తాం. ప్రశాంత్ నీల్ చాలా వేగంగా పనిచేస్తారని అందరికీ తెలిసిన విషయమే. ఎన్టీఆర్ హిందీ చిత్రం వార్ 2 ఫెయిల్యూర్ తర్వాత మేము కొంత సమయం తీసుకుని కథలో మార్పులు చేశాం. ఇప్పుడు అన్నీ కుదిరి నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయన్నారు.
తాజా అప్డేట్తో కథలో ఎలాంటి మార్పులు చేశారని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. కాగా ఎన్టీఆర్-నీల్ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను మే 20న లాంచ్ చేయనున్నారు. జూన్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ కో ప్రొడ్యూస్ చేస్తోంది. కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.