రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘చంద్రముఖి-2’. కంగనారనౌత్ టైటిల్ రోల్‌ను పోషిస్తున్నది. పి.వాసు దర్శకుడు. సెప్టెంబర్ 15న విడుదల కానుంది. చెన్నైలో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. లారెన్స్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో కంగనారనౌత్ పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది. ఆమె తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది’ అన్నారు. కంగనారనౌత్ మాట్లాడుతూ ‘ఇన్నేళ్ల నా కెరీర్లో చేసిన గొప్ప సినిమా ఇది. దర్శకుడు వాసు ప్రతీ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు.
నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రమవుతుంది’ అని చెప్పింది. దర్శకుడు వాసు మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని లారెన్స్‌తో చేస్తున్నామని రజనీకాంత్‌గారికి చెప్పినప్పుడు తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు. కంగనారనౌత్ ఈ కథను ఎంతగానో ఇష్టపడింది. తన పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేసింది. కీరవాణి సంగీతం సినిమాకు పెద్ద బలంగా నిలుస్తుంది’ అన్నారు. కథానుగుణంగా చక్కటి సంగీతం కుదిరిందని కీరవాణి చెప్పారు.