Kangana Ranaut | అందం, రాజసంతో మంత్రముగ్ధుల్ని చేస్తున్న కంగనా.. చంద్రముఖి ఫస్ట్‌లుక్ రిలీజ్
Kangana Ranaut | కంగనారనౌత్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘చంద్రముఖి-2’. రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్నారు. పి.వాసు దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.
Kangana Ranaut | కంగనారనౌత్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘చంద్రముఖి-2’. రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్నారు. పి.వాసు దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. 2005లో వచ్చిన ‘చంద్రముఖి’ చిత్రానికి సీక్వెల్ ఇది. శనివారం చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. సంప్రదాయ పట్టుచీరలో ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి రాజసంతో కనిపిస్తున్నది కంగనా రనౌత్.
‘ఈ చిత్రంలో అందం, రాజసం, అధికారం మూర్తీభవించిన చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ అభినయం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. వడివేలు, లక్ష్మీమీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, విఘ్నేష్ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్, ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

