Chandra Mohan | చంద్ర మోహన్ మేనల్లుడు స్టార్ ప్రొడ్యూసర్ అని తెలుసా.?
Chandra Mohan | చంద్రమోహన్.. ఒకప్పుడు హీరో.. తర్వాత కామెడీ హీరో.. ఆ తర్వాత ఫాదర్, బ్రదర్, అంకుల్.. ఇలా సినిమాలోని పాత్రలన్నీ ఆయనవే. మొత్తంగా 57 ఏళ్ల నుంచీ తెలుగు సినిమాతో కలసి నడుస్తున్న అనుభవం అయనది.
Chandra Mohan | చంద్రమోహన్.. ఒకప్పుడు హీరో.. తర్వాత కామెడీ హీరో.. ఆ తర్వాత ఫాదర్, బ్రదర్, అంకుల్.. ఇలా సినిమాలోని పాత్రలన్నీ ఆయనవే. మొత్తంగా 57 ఏళ్ల నుంచీ తెలుగు సినిమాతో కలసి నడుస్తున్న అనుభవం అయనది. 175 సినిమాల్లో హీరోగా, మొత్తంగా 900కు పైగా చిత్రాల్లో నటించిన చంద్రమోహన్ (Chandramohan) మాత్రం తన వారసులను సినీ పరిశ్రమకు పరిచయం చేయలేదు. ఆయన కుటుంబం నుంచి ఒక్కరు కూడా సినిమాల్లోకి రాలేదు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే చంద్రమోహన్ కుటుంబం నుంచి కూడా ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నాడు. అతడే శ్రీదేవి మూవీస్ బ్యానర్ అధినేత శివ లెంక కృష్ణ ప్రసాద్(Shivalenka Krishna Prasad). ఈయన చంద్ర మోహన్ కి స్వయానా సోదరి కొడుకు.
సినిమా ఇండస్ట్రీపై ఇష్టంతో తన మామ చంద్రమోహన్ సహాయంతో శ్రీదేవి మూవీస్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు శివ లెంక కృష్ణ ప్రసాద్. అ తరువాత చంద్ర మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లను పెట్టి చిన్నోడు పెద్దోడు అనే ఒక సినిమా తీశారు. ఆ తరువాత బాలకృష్ణ ఆదిత్య 369 సినిమాకు నిర్మాతగా వ్యవహరించి బ్లక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఆ తరువాత వంశానిక్కొక్కడు, ఊయల, అనగనగా ఒక అమ్మాయి, భలేవాడివి బాసు, మిత్రుడు, నాని జెంటిల్మెన్, సమ్మోహనం వంటి సినిమాలు తీసి మంచి విజయాలు అందుకున్నాడు. ఇక రీసెంట్గా శివ లెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన చిత్రం యశోద. సమంత లీడ్ రోల్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

