Chandra Mohan | ముగిసిన చంద్రమోహన్ అంత్యక్రియలు
Chandra Mohan | టాలీవుడ్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ (Chandra Mohan) అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటికలో చంద్రమోహన్ కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి.
Chandra Mohan | టాలీవుడ్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ (Chandra Mohan) అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటికలో చంద్రమోహన్ కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుమందు ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొని చంద్రమోహన్‌కు కడసారి వీడ్కోలు పలికారు. అనంతరం పంజాగుట్టలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ అపోలో దవాఖానలో చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీతో పాటు వివిధ సినీ పరిశ్రమల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చంద్రమోహన్ ఎన్నో మరుపురాని సినిమాలతో సినీ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా జీవించి ఉంటారని గుర్తు చేసుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

