Lawrence of Punjab | గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ డాక్యుమెంటరీపై నిషేధం? కేంద్రం కీలక ఆదేశాలు
Lawrence of Punjab | ఇండియా మెస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జీవితం ఆధారంగా రూపొందిన ‘లారెన్స్ ఆఫ్ పంజాబ్’ డాక్యుమెంటరీ సిరీస్ విడుదలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Lawrence of Punjab | ఇండియా మెస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జీవితం ఆధారంగా రూపొందిన ‘లారెన్స్ ఆఫ్ పంజాబ్’ డాక్యుమెంటరీ సిరీస్ విడుదలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయవద్దని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ZEE5ని ఆదేశించింది. వ్యవస్థీకృత నేరాలను గ్లామరైజ్ చేసేలా ఉన్న ఈ కంటెంట్ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా సిద్ధూ మూసేవాలా హత్య వంటి సున్నితమైన అంశాలు పంజాబ్‌లో అశాంతికి దారితీస్తాయని పోలీసులు మరియు రాజకీయ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఈ సిరీస్‌ను నిషేధించాలని కోరుతూ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ రాజా వారింగ్ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఐటీ చట్టం సెక్షన్ 69A(1) కింద దీనిని నిలిపివేయాలని సైబర్ క్రైమ్ విభాగం కోరింది. ఏప్రిల్ 27న విడుదల కావాల్సిన ఈ డాక్యుమెంటరీ హింసను ప్రేరేపించేలా ఉందని కేంద్రం అభిప్రాయపడింది. మరోవైపు, తమ అనుమతి లేకుండా ఈ సిరీస్ నిర్మించారని లారెన్స్ బిష్ణోయ్ కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ట్రైలర్‌ను తొలగించడంతో పాటు సిరీస్ విడుదలను నిలిపివేయాలని ప్రభుత్వం ZEE5కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

