ఈ సారి కూడా టైటిల్ మాదే
సెలబ్రిటీ క్రికెట్ లీగ్(CCL) 11వ సీజన్ ఫిబ్రవరి 8న బెంగళూరులో ప్రారంభం కానుంది. CCL నాలుగు సీజన్లలో వరుసగా తెలుగు వారియర్స్ ఛాంపియన్స్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ లెగసీని కొనసాగించేందుకు మరోమారు తెలుగు వారియర్స్ సిద్ధమయ్యారు.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్(CCL) 11వ సీజన్ ఫిబ్రవరి 8న బెంగళూరులో ప్రారంభం కానుంది. CCL నాలుగు సీజన్లలో వరుసగా తెలుగు వారియర్స్ ఛాంపియన్స్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ లెగసీని కొనసాగించేందుకు మరోమారు తెలుగు వారియర్స్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో తెలుగు వారియర్స్ జెర్సీని ఆవిష్కరించారు. టీమ్ కెప్టెన్ అఖిల్ అక్కినేని మాట్లాడుతూ ‘సీసీఎల్ ఆడుతూ పెరిగా. ఇప్పటికి నాలుగు సార్లు టైటిల్ గెలిచాం. ఈ సారి కూడా టైటిల్ మాదే. ఎంటైర్టెన్ చేయాలనే పాషన్‌తో వస్తున్నాం. ఈ నెల 14, 15 తేదీల్లో ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నాం.
వచ్చి సపోర్ట్ చేయండి’ అని కోరారు. ‘క్రికెట్ అనేది నా ఛైల్డ్వుడ్ డ్రీం. సీసీఎల్ ఫార్మాట్‌తో నా కల నెరవేరింది. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ ఇందూరికి థ్యాక్స్ చెప్పుకుంటున్నా. దేశంలోని ప్రముఖ మైదానాల్లో క్రికెట్ అడటం అదృష్టం. అఖిల్ అగ్రెసివ్ కెప్టెన్. తన ఎత్తుగడలు బావుంటాయి. సచిన్‌జోషి ఈ టీమ్‌కి ఓనర్‌తోపాటు ఆటగాడు కూడా. క్రేజీ టీమ్‌తో వస్తున్నాం.. కప్ కొడతాం.’ అని ఎస్.ఎస్.తమన్ నమ్మకంగా చెప్పారు. అఖిల్ పాషనేట్ క్రికెటర్ అని, తమన్ టీమ్‌లో స్పిరిట్‌ని తీసుకొచ్చారని, సచిన్ జోషి చెప్పారు. ఇంకా అశ్విన్, రఘు, ఆది, సామ్రాట్, సీసీఎల్ వ్యవస్థాపకుడు విష్ణువర్ధన్ ఇందూరి, రికా వ్యాలీ ఛైర్మన్ షోరబ్ అర్ఫాత్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharmistha Mukherjee: ప్రణబ్ ముఖర్జీపై సోనియా కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన శర్మిష్ట ముఖర్జీ
‘బుడ్డగూడెం’ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా
Drinking Water | నిజామాబాద్ శివారులో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు.. వీడియో
Anna Lezhneva | పవన్ కళ్యాణ్- అన్నా లెజినోవా వైవాహిక బంధంపై చర్చ.. ఆమె ఆస్తులు రూ.1,800 కోట్లా..!
Matrimonial Dispute: భార్యాభర్తల గొడవ.. భారత మహిళ నుంచి వాంగ్మూలం తీసుకోనున్న కివీస్ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

