Revanth | బిగ్‌బాస్ కంటెస్టెంట్ రేవంత్ ఇంట సంబరాలు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత..!
Revanth | అత్యంత ప్రేక్షకాదరణ పొందిన బిగ్‌బాస్ షో ఆరో సీజన్లో టాప్ కంటెస్టెంట్‌గా కొనసాగుతున్న టాలీవుడ్ స్టార్ సింగర్ రేవంత్ ఇంట సంబరాలు మొదలయ్యాయి. ఆయన భార్య అన్విత పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రేవంత్ సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. రేవంత్, అన్విత ఈ ఏడాది ఫిబ్రవరి 7న వివాహబంధంతో ఒక్కటయ్యారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.

రేవంత్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మొదటి నుంచి తన ఆటతీరుతో మంచి మార్కులే కొట్టేస్తున్నారు. ఇక రేవంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే సమయంలో ఆయన సతీమణి నిండు గర్భిణి. ఇలాంటి సమయంలో భార్యను వదిలి వచ్చానని చాలా సార్లు బాధపడ్డాడు. ఇక హౌస్‌లో ఉన్న సమయంలోనే రేవంత్ భార్య అన్విత సీమంతం కూడా జరిగింది . ఆ వీడియోను హౌస్ లో ప్లే చేసి రేవంత్‌ను హ్యాపీ చేశారు బిగ్ బాస్. ఈ వీడియో చూస్తూ రేవంత్ చాలా ఎమోషనల్ అయ్యాడు. రేవంత్ తండ్రయిన వార్త తెలుసుకున్న అభిమానులు, పలువురు సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!