పర్యావరణ సందేశంతో ‘ఫణి’
కేథరిన్ ట్రెసా ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఫణి’. వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. మహేష్శ్రీరామ్ కీలక పాత్రధారి. బుధవారం హైదరాబాద్‌లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
కేథరిన్ ట్రెసా ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఫణి’. వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. మహేష్శ్రీరామ్ కీలక పాత్రధారి. బుధవారం హైదరాబాద్‌లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. తొలుత చిన్న చిత్రంగా ఆరంభమైన ఈ ప్రాజెక్ట్ అనంతరం గ్లోబల్ మూవీగా తయారైందని, ఇందులో పాము పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చిత్ర నిర్మాత, సంగీత దర్శకురాలు డా॥ మీనాక్షి పేర్కొన్నారు. తన మీద నమ్మకంతో సోదరి మీనాక్షి, బావ శాస్త్రి ఈ సినిమా ద్వారా ప్రొడక్షన్లోకి ఎంటరయ్యారని, వినూత్నమైన కాన్సెప్ట్‌తో గ్లోబల్ మూవీగా తెరకెక్కించామని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తామని దర్శకుడు వి.ఎన్.ఆదిత్య తెలిపారు. ఇలాంటి వైవిధ్యమైన కథలో ఎప్పుడూ నటించలేదని, పాము నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని కథానాయిక కేథరిన్ తెలిపింది. ఈ కథలో ‘భూమి మనది మాత్రమే కాదు..ప్రకృతిది కూడా’ అనే గొప్ప సందేశం ఉంటుందని రైటర్ పద్మ అన్నారు. భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర సమర్పకులు పద్మనాభ రెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: ఏయు అండ్ ఐ స్టూడియో పద్మనాభ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీఎన్ ఆదిత్య.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

