Catherine Tresa | అభినవ శశిరేఖ

‘అందం, ఆత్మవిశ్వాసం కలగలసిన ఆధునిక భావాలున్న యువతి శశిరేఖ. ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని నమ్ముతుంటుంది. ఓ లక్ష్యం కోసం ఆమె సాగించిన ప్రయాణమేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు చైతన్య దంతులూరి. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘భళా తందనాన’. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్నారు. సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేథరిన్ కథానాయిక. ఇందులో ఆమె శశిరేఖ అనే పాత్రలో కనిపించబోతున్నది. కేథరిన్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ఆమె ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. నిర్మాత మాట్లాడుతూ ‘క్రైమ్, యాక్షన్, సస్పెన్స్ అంశాల సమ్మిళితంగా రూపొందుతున్న చిత్రమిది. శ్రీవిష్ణు, కేథరిన్ పాత్రలు సరికొత్తగా ఉంటాయి. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ జరుగుతోంది’ అని తెలిపారు. రామచంద్రరాజు ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

