Sandhya Theatre | హైదరాబాద్ సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు
Pushpa 2 Stampede | ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు అయ్యింది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
Pushpa 2 Stampede | ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు అయ్యింది. సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సినిమా చూసేందుకు వచ్చిన అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాటలో (Pushpa 2 Stampede) ఓ మహిళ మృతిచెందారు.
బుధవారం రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షోను చూసేందుకు హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు రాగా.. అతడిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకున్నది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి (39) అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ (9) కింద పడిపోయి జనాల కాళ్ల మధ్య నలిగిపోయారు. వారిద్దరూ తీవ్ర గాయాలతో సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే తల్లీకుమారులను పోలీసులు పక్కకు తీసుకెళ్లి సీపీఆర్ చేశారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ దవాఖాన తరలించగా.. చికిత్స పొందుతూ రేవతి మృతి చెందారు. శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్హాస్పిటల్కు తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
అయితే ఈ ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు అయ్యింది. థియేటర్ యాజమాన్యం సెక్యూరిటీ సరిగ్గా ఏర్పాటు చేయకపోవడంతోనే తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందరాని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు సంధ్య థియేటర్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

