Cable Reddy | సుహాస్ కొత్త సినిమా నుంచి ఫస్ట్లుక్ అప్డేట్.. ఎప్పుడంటే
Cable Reddy | షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వీడియోస్తో కెరీర్ ప్రారంభించి చిన్న చిన్న పాత్రలు వేస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుహాస్ (Actor Suhas). ‘కలర్ ఫోటో’ (Colour Photo) సినిమాతో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించాడు.
Cable Reddy | షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వీడియోస్తో కెరీర్ ప్రారంభించి చిన్న చిన్న పాత్రలు వేస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుహాస్ (Actor Suhas). ‘కలర్ ఫోటో’ (Colour Photo) సినిమాతో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించాడు. కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు టాలీవుడ్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇక ఇటీవలే రైటర్ పద్మభూషణ్ (Writer Padmabushan)తో థియేటర్ హిట్టును కొట్టేశాడు. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక ప్రస్తుతం సుహాస్ చేతిలో మూడు, నాలుగు సినిమాలున్నాయి. అందులో కేబుల్ రెడ్డి (Cable Reddy) ఒకటి.
సుహాస్, షాలిని కొండేపూడి (Shalini Kondepudi) జంటగా నటిస్తున్న ఈ సినిమాను ఫ్యాన్ మేడ్ ఫిల్మ్స్ (Fan Made Films) పతాకంపై బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తుండగా.. శ్రీధర్ రెడ్డి (Sridhar Reddy) దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను రేపు ఉదయం 11.43 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. “శుభవార్త !! ప్రపంచవ్యాప్తంగా అందరి ఫోన్లలో మా మొట్ట మొదటి పోస్టర్ (First Look) రేపు ఉదయం 11.43 గంటలకు విడుదల అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో రాసుకోచ్చారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మహిరెడ్డి పండుగల, సంగీతం: స్మరణ్ సాయి, ఆర్ట్: క్రాంతి ప్రియం.
#CableReddy మొట్ట మొదటి పోస్టర్ రేపు మీ ఫోన్ల లో ❤️🔥#CableReddy first look tomorrow at 11.43 AM 💫✨@ActorSuhas #ShaliniKondepudi @sridharbobbala #BaluVallu #PhaniAcharya @thefanmadefilms pic.twitter.com/TMTWxJyOQy
— Vamsi Kaka (@vamsikaka) September 20, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

