అనిఖా సురేంద్రన్, సూర్యవశిష్ట, అర్జున్దాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బుట్టబొమ్మ’. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు. ఎస్.నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ నెల 26న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని కాస్త ఆలస్యంగా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని శనివారం చిత్ర నిర్మాతలు ప్రకటించారు. మలయాళంలో విజయవంతమైన ‘కప్పెల’ చిత్రానికి రీమేక్ ఇది.
ఫోన్ ద్వారా ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం అందమైన అమ్మాయి జీవితంలో ఎలాంటి మలుపులకు కారణమైందన్నదే చిత్ర కథాంశం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని, విభిన్న కథాంశంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, సంభాషణలు: గణేష్ కుమార్ రావూరి, దర్శకత్వం: శౌరి చంద్రశేఖర్ రమేష్.