Butta Bomma Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న ‘బుట్ట బొమ్మ’ టీజర్..!
Butta Bomma Movie Teaser | టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో సితార ఎంటర్టైనమెంట్స్ ఒకటి. ఈ సంస్థ నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే విధంగా ప్రేక్షకుల్లో ఓ మార్కు క్రియేట్ అయింది. ఈ బ్యానర్లో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా తెరకెక్కుతుంటాయి.
Butta Bomma Movie Teaser | టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో సితార ఎంటర్టైనమెంట్స్ ఒకటి. ఈ సంస్థ నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే విధంగా ప్రేక్షకుల్లో ఓ మార్కు క్రియేట్ అయింది. ఈ బ్యానర్లో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా తెరకెక్కుతుంటాయి. కాగా ప్రస్తుతం ఈ సంస్థ ‘బుట్ట బొమ్మ’ అనే చిన్న సినిమాను నిర్మిస్తుంది. శౌరీ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్న మలయాళంలో సూపర్ హిట్టయిన కప్పెల సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. అర్జున్ దాస్, అంకితా సురేంద్రన్, సూర్య వశిష్ట ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
లేటెస్ట్గా రిలీజైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఒక అమ్మాయికి అనుకోకుండా ఫోన్ కాల్లో ఓ అబ్బాయి పరిచయమవుతాడు. ఆ అబ్బాయి ఆటో డ్రైవర్. మెల్లగా వీరిద్దరూ లవ్‌లో పడతారు. ఫోన్లోనే వీరిద్దరూ మాట్లాడుకుంటుంటారు. అయితే వీళ్లు ఒక రోజు కలుద్దాం అనుకుంటారు. అయితే అదే రోజున వీళ్ల లైఫ్‌లోకి మరో వ్యక్తి వస్తాడు. ఆ మూడో వ్యక్తి వల్ల వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది అనే కథాంశంలో ఈ చిత్రం తెరకెక్కింది. లవ్ స్టోరీతో మెదలైన ఈ చిత్రం మెల్లిగా థ్రిల్లర్ మోడ్‌లోకి వెళ్తుంది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి.
.@Fortune4Cinemas @adityamusic
— Sithara Entertainments (@SitharaEnts) November 7, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

