RamaRao On Duty | ‘బుల్బుల్ తరంగ్’ అంటున్న రామారావు.. ఫస్ట్‌సింగిల్ వచ్చేది అప్పుడేనట?
మాస్రాజ రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ తీరిక లేకుండా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేసే విధంగా రవితేజ ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించబోతున్నాడు.
RamaRao On Duty | మాస్రాజ రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ తీరిక లేకుండా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేసే విధంగా రవితేజ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. గతనెల ‘ఖిలాడీ’తో భారీ ఫ్లాప్‌ను అందుకున్న మాస్రాజ ఈ సారి ‘రామారావు ఆన్ డ్యూటీ’తో ఎలాగైనా మంచి హిట్టు సాధించాలని కసితో ఉన్నాడు. శరత్ మండవ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవలే స్పెయిన్‌లో రెండు పాటలను చిత్రీకరించి సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న ఈ చిత్రం నుంచి బిగ్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రంలోని ‘బుల్బుల్ తరంగ్’ అంటూ సాగే లిరికల్ సాంగ్ వీడియోను ఏప్రిల్10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పాట రవితేజ, రజిషా విజయన్ మధ్య సాగే లవ్సాంగ్గా ఉన్నట్లు తెలుస్తుంది. పోస్టర్లో రవితేజ, రజీషాలు కండువను మెడపై వేసుకొని ఒకరినొకరు చూసుకుంటున్నట్లు పోస్టర్లో ఉంది. ఈ చిత్రంలో దివ్యాంశ కౌషిక్ మరో హీరోయిన్గా నటించింది. చాలా కాలం తర్వాత సీనియర్ నటుడు వేణు తోట్టెంపూడి ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీ లక్ష్మివెంకటేశ్వరా సినిమాస్, ఆర్టి టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించబోతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Ramarao prema 👩❤️👨❤️#RamaRaoOnDuty First single 🎵 #BulBulTarang on 10th April 😊#RamaRaoOnDutyOnJune17 pic.twitter.com/8oBZpumVBt
— Ravi Teja (@RaviTeja_offl) April 7, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

