Bubblegum | రోషన్ అమ్మనాన్న పేరు నిలబెట్టాలి
‘రోషన్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. తొలిసినిమానే ఇంత ఈజ్‌తో చేయడం చిన్నవిషయం కాదు. టీజర్‌ని బట్టి చూస్తే చాలా బలమైన కంటెంట్‌తో తీసిన సినిమాలా అనిపిస్తుంది. రోషన్ పెద్దహీరో అయి, అమ్మానాన్న పేర్లు నిలబెట్టాలి’ అని హీరో నాని అన్నారు.
‘రోషన్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. తొలిసినిమానే ఇంత ఈజ్‌తో చేయడం చిన్నవిషయం కాదు. టీజర్‌ని బట్టి చూస్తే చాలా బలమైన కంటెంట్‌తో తీసిన సినిమాలా అనిపిస్తుంది. రోషన్ పెద్దహీరో అయి, అమ్మానాన్న పేర్లు నిలబెట్టాలి’ అని హీరో నాని అన్నారు. రాజీవ్‌కనకాల, సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం ‘బబుల్గమ్’. మానస చౌదరి కథానాయిక. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రవికాంత్ పేరెపు దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం టీజర్‌ని మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో నాని విడుదల చేశారు. ఇంకా నాని మాట్లాడుతూ ‘ మరో సక్సెస్ఫుల్ హీరో తెలుగు చిత్రపరిశ్రమకు వచ్చాడని టీజర్ చూశాక అనిపిస్తున్నది. మానస, రోషన్ల స్క్రీన్ ప్రెజన్స్ బావుంది. కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది.
దర్శకుడు రవికాంత్ క్లారిటీ ఉన్న దర్శకుడు. తన కంటూ ఓ సంతకం ఉంటుంది. అది టీజర్లో కనిపించింది. డిసెంబర్ 29న విడుదల కానున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’ అన్నారు. సపోర్ట్ చేసిన అందరికీ హీరో రోషన్ కృతజ్ఞతలు తెలియజేశాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం, ప్రేక్షకుల అండదండలు తనకుంటాయని నమ్ముతున్నానని రోషన్ అన్నారు. రోషన్, మానస చాలా గ్రేస్‌తో తమ పాత్రలని పోషించారనీ, అందరికీ మంచి పేరుతెచ్చే సినిమా అవుతుందని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులంతా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ రగుతు, సంగీతం: శ్రీచరణ్ పాకాల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

